పేరు లో ఏముంది?

ఏముందంటే... మనిషికి ఒక identity ని ఇచ్చే మొట్టమొదటి attribute పేరే కదా! ఆ తర్వాతే ఇంకేమైనా! అందమైన రూపం లాగే అందమైన పేరు ఉండటం మనిషికి చక్కటి అసెట్ అని నా నమ్మకం. అందమైన రూపం దైవ దత్తమైతే, పిల్లలకి చక్కటి పేరు పెట్టడం తల్లి తండ్రుల చేతుల్లో ఉంది! కొన్నేళ్ళ క్రితం వరకు అయితే చక్కటి పేర్లు పెట్టాలనుకునేవాళ్ళు ఏ మల్లాది రాసిన పేర్ల పుస్తకమో కొనుక్కుని అందులోంచి వెతుక్కుని, ఇంకా తెలిసిన వాళ్ళలో ఎవరి దగ్గరైన suggestions తీసుకుని పేరు పెట్టాల్సి వచ్చేది. ఏదైనా చక్కటి తెలుగు నవలో కధో చదువుతూ అందులో మంచి పేరు ఎంచుకోడం కూడా జరుగుతూ ఉండేది. యండమూరి ఆఖరి పోరాటం రాసిన తర్వాత చాలా మంది ఇళ్ళల్లో ఆడపిల్లలకి ప్రవల్లిక అని పేరు పెట్టడం నేను విన్నాను.  మునుపటి కన్నా ఇప్పుడు చాలా మందిలో పిల్లలకి చక్కటి అర్ధవంతమైన పేర్లు పెట్టాలని ఇంకా వీలయితే ఎక్కడా ఇంకెవ్వరికీ లేని కొత్త unique పేర్లు పెట్టాలనే తాపత్రయం కనపడుతోంది. దానికి తగ్గట్టు గానే ఈ రోజు ఇంటర్నెట్ లో పేర్లు వాటి అర్ధాలు చెప్పే సైటులు కోకొల్లలు. ఈ వెబ్ సైట్లలో  ఎవైన రెండో మూడో అక్షరాలు అందం గా కలిపేసి వాటికో అర్ధాన్ని అంటగట్టేస్తూ ఉంటారు. ఆది అంటే మొదలు కాబట్టి ఆ పదం నుంచి coin చేసిన పేరు ఏంటంటే, ఆదిత్. అర్ధం మొదటి వాడు అనిట! మొదటి వాడిని ఆద్యుడు అనడం విన్నాను కానీ ఆదితుడు అని అనడం నేనెప్పుడు ఎక్కడా వినలేదు. నా friend ఒక అమ్మాయి తన కొడుక్కి మానిన్ అని పేరు పెట్టింది. ఏదో వెబ్సైటు లో చూసి చాలా బాగుందని ఆ పేరు పెట్టింది. అర్ధం ఏంటంటే one who is always respected అని  చెప్పింది. నాకు తెలిసినంత వరకు, మానిని అంటే స్త్రీ. గౌరవింప బడే వాడిని మాన్యుడు అంటారు కానీ, మానినుడు అనడం నాకు తెలిసిన తెలుగు లో నేను ఎప్పుడు వినలేదు. ఇంకా అనికేత్.. ఈ మాటకి నిజమైన అర్ధం ఇల్లు లేని వాడు అని. ఎక్కడో విష్ణు మూర్తి ని పొగడడానికి సర్వాంతర్యామి కాబట్టి  అందరి హృదయాలలో  ఉండే ఆయనకి ఇల్లు అక్కర్లేదు కాబట్టి ఆయనని అనికేతుడు అని ఏదో మంత్రం లోనో శ్లోకం లోనో వాడి ఉండచ్చు. అంత మాత్రాన, ఇల్లు లేని వాళ్ళందరూ విష్ణువులు కాలేరు కదా! అన్ని names సైట్లలోను, అనికేత్- లార్డ్ విష్ణు అని రాసి ఉంటుంది. ఇంకో పేరు అతిరిక్త్ - అంటే ఖాళీ అని అర్ధం. ఎంత పదం బాగుంటే మాత్రం! ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నేను విన్న పేర్లు ఈ మధ్య కాలం లో! వాటిల్లో కొన్ని.. గిరితనయ్(పార్వతి దేవి పేరుకి రూపాంతరం) , సైకత్ (ఇసక) , అన్యోన్య, నరిష్మ,  లిప్సిక, సమయానికి గుర్తు రావడం లేదు కానీ ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి..

పిల్లలకి పెట్టె పేర్లు అందం గా unique గా ఉండాలి నిజమే.. కాని వాటి అర్ధం కూడా ముఖ్యమే కదా! ఒక్క సారి పేరు పెట్టే ముందు దాని అర్ధం ఏంటో నిజం గా తెలుసుకుని ఏదో సమాసం వాడేసి దాని అర్ధం ఒక దేవుడి పేరు అని ఎవరైనా చెప్తే, లేదా ఎక్కడైనా చదివితే కాబోలు అనుకుని ఆ పేరు పెట్టేసుకోకుండా, కాస్త దాని అర్ధం ఏమిటో తెలుగు తెలిసిన వాళ్ళని ఒక పది మందిని అడిగి అప్పుడు పెట్టుకుంటే.. చాలా బాగుంటుంది కదా!
ఒక సరదా అయిన విషయం తో దీన్ని ముగిస్తాను.. ఒక సారి సహస్రావధాని, పుంభావ సరస్వతి అయిన శ్రీ గరికిపాటి నరసింహ రావు గారి అవధాన కార్యక్రమం ఏర్పాటు చేసారట హైదరాబాదు లో. ఆ కార్యక్రమ నిర్వాహకులకి గరికిపాటి వారు ఒక telegram ఇచ్చారు.. coming along with Gurajada and Srisri on so and so date. Please make necessary arrangements అని ఆ telegram సారాంశం. అది చూసి వాళ్లకి ఏమి అర్ధం కాలేదట.. ఇదేమి చమత్కారం ఈయన గురజాడ శ్రీశ్రీ లని తీసుకుని రావడం ఏంటి? అని! తీరా విషయం ఏంటంటే.. అయన పిల్లలిద్దరికి ఆయన గురజాడ శ్రీశ్రీ అని పేర్లు పెట్టుకున్నారు ఆ  మహానుభావుల మీద చెప్పలేని అభిమానం తో!  అది తెలిసిన వాళ్ళందరూ సరదాగా నవ్వుకున్నారు. నేనేమో ఆ అబ్బాయిల మీద కొంచెం జాలి పడ్డాను.. ముఖ్యం గా గురజాడ మీద.. ఒక మహానుభావుడి ఇంటి పేరు ని జీవితాంతం తన సొంత పేరు గా భరించాల్సి వచ్చినందుకు!








1 comments:

భావన said...

హ హ హ బాగా చెప్పేరు. ఈ మధ్యన ఈ పిచ్చి ఏమిటో ఎవ్వరికి వుండని పేరు వుండాలి అని. నాకు డౌట్ వస్తుంది ఏం ఎందుకు ఎవ్వరి కి వుండని పేరు??? ఎమవుతుంది ఇంకా ఎవరికైనా వుంటే. అడీగితే విచిత్రం గా చూసి మా అబ్బాయి మాకు స్పెషల్ కదా అందుక ఇంక ఎవ్వరికి వుండకూడదు అన్నారు, ఆ లాజిక్ అర్ధం కాలా, వూరుకున్నా. కాస్త అర్ధాలు చూసుకుని పెడితే బాగు అవును.

Post a Comment