భోగి పళ్ళ పేరంటం... (e-పేరంటం)

భోగి పండగ.. అమ్మ నాలుగు రోజుల ముందే ఫొను చేసినప్పుడు చెప్పేసింది.. "చంటాడికి భోగి పళ్ళు పొయ్యవే! మొదటి ఏడాది,మానకు. " అని! "తప్పకుండా పోస్తానమ్మా" అన్నాన్నేను. "ఇక్కడికి వస్తే నేను చక్కగా పేరంటం పిలిచేదాన్ని. నువ్వు రావు" అని నిష్ఠూరం కూడా వేసింది! ఇవ్వాళా రేపూ పల్లెటూళ్ళలొ కూడ వేలెంటైన్స్ డే ల హవా నే తప్ప భోగి మంటలూ. పేరంటాలూ ఎక్కడో తప్ప లేవు అనేది నిజమే అయినా... ట్రెడిషనల్ వేల్యూస్ అనేవి బయట సమాజం ఎంత మారినా మన ఇంట్లో మనం నిలబెట్టుకోడం ముఖ్యం అని నమ్మే దాన్ని నేను.

అందుకే అట్లాంటా లో ఉన్నప్పుడు కూడ,మా పెద్దబ్బాయికి భోగిపళ్ళు పేరంటం పెట్టి మరీ చేసాను. అక్కడ రేగుపళ్ళు దొరకకపోతే చెర్రీ లతొ పోసాను భోగి పళ్ళు!

ఇప్పుడు బెంగళూరు లో రేగుపళ్ళూ ఉన్నాయి.. నాకు సరదా కూడా ఉంది! రాత్రే గబ గబా రేగుపళ్ళు కొనేసుకుని శనగలు నాన పెట్టేసాను. కానీ వచ్చి నాలుగు నెలలు అవుతున్నా పేరంటం పిలవడానికి ఇక్కడ నాకు ఎవ్వరూ తెలీదు! "పోనీలే మనమే ఇంట్లో చేసేద్దాం. ఎవరూ రాకపోతే ఎమైంది? భోగిపళ్ళు పొయ్యడం ముఖ్యం" అని చక్కగ సర్ది చెప్పేసేరు  శ్రీవారు! సరే  అని సర్దుకుపోయాను నేను!

భోగి రోజు పొద్దున పదవుతున్నా, ఇప్పటి వరకూ భోగిమంట ఎలానో చూడలేదు కనీసం బ్లాగులోకం లో  భోగి ఎలా  ఉందో చూసి ఆనందిద్దాం అని కూడలి లోకి వెళ్ళాను..!
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా చుట్టూ ఉన్న వాళ్ళు వింతగా చూస్తున్నా కార్టన్ బాక్సులతో వాళ్ళ భోగి మంట వాళ్ళు వేసుకున్నారని రాసారు భావ నిక్షిప్త.
సంక్రాంతి లక్ష్మి ఎడ్రెస్సు కోసం పట్టణం మీద నెపం పెట్టి తానె వాపోయారు రాత-గీత బ్లాగరు.
 భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు, శుభ కామనలు చెప్పే వాళ్ళు , జ్ఞాపకాల దొంతరలు నెమరు వేసుకునేవాళ్ళు, భోగి మంటల గురించి, రంగు ముగ్గుల గురించి రాసుకునేవాళ్ళు, నా లాంటివాళ్ళు ఈ బ్లాగు ప్రపంచం లో కోకొల్లలు. అందుకే... ఈ e-పేరంటం ఆహ్వానం.


మా అబ్బాయి సమన్యు శర్మ  కి సాయంకాలం భోగి పళ్ళు పోస్తున్నాం! మీ అక్షరాల అక్షింతలతో మా చిట్టి తండ్రి ని ఆశిర్వదించండి!!!
భోగి సంక్రాంతి శుభాకాంక్షలు!!!

9 comments:

Anonymous said...

hi
wishing u very happy bhogi.miru appartments vunte ventane mohamatam vadilesi mi apaprtment lo vallani pilavandi leda pakka illa vallanu pilavandi.papam mi ababyiki muchata ga vuntundi.parchiyama ee vidhamga chesukondi.em parvaledu. mi abbayiki ma bhogi subhakanshalu.

శిశిర said...

చిట్టితండ్రి సమన్యు కి ఆశీస్సులు.

సిరిసిరిమువ్వ said...

పేరంటానికి వచ్చేసాం..మీదే ఆలస్యం..ఇక మొదలుపెట్టండి..

చిరంజీవి సమన్యుకి ఆశీస్సులు.

మధురవాణి said...

మీ చిన్నారి సమన్యు కి ఆశీస్సులు.. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

జయ said...

నేను ఇవాళ భోగిపళ్ళ పేరంటానికి వెళ్ళి ఒచ్చాను. పన్లో పని మీ వాడికి కూడా సూర్యకాంతి లాంటి రేగ్గు పండ్లు పోసి దీర్ఘయుష్మాన్ భవ అని దీవిస్తాను. చక్కటి విద్యతో కలకాలం వర్ధిల్లాలి. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

సవ్వడి said...

బ్లాగు చిరునామా ఒకటి, పేరు ఒకటి.. మీ పేరు మరొకటి పెట్టుకున్నారు. సింపుల్ సౌల్ బదులు మంచి తెలుగు పేరు పెట్టుకుని ఉండాల్సింది. మీ అబ్బాయి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళంలో ఎక్కడ ఉండేవారు. హారిపోటర్ బుక్స్ చదివారంటే మీకు ఇంగ్లీష్ బాగా వచ్చని అర్థమైంది. నాకు అస్సలు రాదు. అందులోను ఆ పుస్తకాలలో మరీ టఫ్ లేంగ్వేజ్.. చదవలేక వదిలేసా! సింపుల్ ఇంగ్లీష్ లో ఉండే కొన్ని మంచి పుస్తకాలను చెప్పండి చదువుతాను. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా...

simplesoul said...

మా అబ్బాయిని ఆశీర్వదించిన మీ అందరికీ థాంక్స్.

simplesoul said...

@సవ్వడి..

శ్రీకాకుళం లో మేమున్నది వుమెన్స్ కాలేజీ ఎదురుగా.. ఇక harry potter పుస్తకాలంటే నాకెంతో ఇష్టం.. మీకు పుస్తక పఠనం ఇష్టమైతే, తప్పకుండా చదవండి వాటిని.. ఇక english అంటారా.. మొదలు పెట్టినప్పుడు అందరికి కొంచెం కొంచెమే తెలుస్తుంది.. చదూతూ పోతుంటే.. అదే వచ్చేస్తుంది చక్కగా.. అయినా అడిగరు కాబట్టి, to begin with హాయిగ R.K.Narayan పుస్తకాలు చదవండి.. The Guide, The English Teacher, Malgudi Days,లాంటివి.. ఆ తర్వాత నెమ్మదిగ Sidney Sheldon, Jeffery Archer, ఇంక Dan Brown etc.. etc..

సవ్వడి said...

మీ పేరు చెప్పలేదుగా! మీరు చెప్పినట్లుగానే నారాయనణ్ గారి పుస్తకాలు చదువుతాను. తరువాత మిగతావాళ్లవి కూడా! ది గైడ్.. మంచి పుస్తకమని విన్నాను. ముందు అదే చదువుతాను. షెల్టన్ గురించి కూడా విన్నాను. మిగతా వారి గురించి వినలేదు. కాబట్టి వారి మంచి పుస్తకాలను కాస్తా తెలియజేస్తారా ! పుస్తక పఠనం అంటే నాకు చాలా ఇష్టం. "తెలుగులో బాగా చదివాను" అస్ని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ వి చదవాలి మరి.

Post a Comment