సడి సేయకో గాలి...

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసిన పాటలలో బహుశా ఇది number one, ఇది number two అని దేనికీ ranking ఇవ్వడం అసాధ్యమేమో!!! "సడి సేయకో గాలి.." అనే పాట అందం గురించి వర్ణిoచబోతే, ఆ పాట అందం ముందు అన్ని విశేషణాలూ వెల వెల పోతాయి కదా!

'నా రాజు అలిసిపొయి ఒళ్ళో బజ్జున్నాడు, నీ వల్ల ఆకులు కదిలి, అదిరి తన నిద్ర చెదిరితే నేనూరుకుంటానా? హన్నా!!!'
అంటూ, పిల్ల తెమ్మెరల లాంటి చల్లతి మాటలతొ చల్ల గాలినే మందలించడం కృష్ణ శాస్త్రి గారికే చెల్లింది.

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
సడి సేయకే...

రత్న పీఠిక లేని రారాజు నా సామి
మణికిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని సొలసి పోరాదె..
సడి సేయకే...

ఏటి గల గలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటె నెనూరుకొనే
సడి సేయకే...

పండు వెన్నెల నడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల దీవన పూని విసిరి పోరాదే..

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..



Sadi seyako gali.. lyrics transliteration

sadi seyako gali sadi seyaboke

badali odilo raju pavvalinchene..

rathna peethika leni raraju na sami
manikireetamu leni maaraju gakemi
chilipi parugulu mani solasi porade..

eti gala galalake egasi lechene
aaku kadalikalake adari choosene
nidura chedarindante nenoorukone

pandu vennela nadigi panpu theraade
needa mabbula daagu nidura theraade
virula deevana pooni visiri porade..

0 comments:

Post a Comment