న్యూ హోం...

ఇన్నాళ్ళూ గూగుల్ పేజెస్ లో ఉన్న నా వెబ్ హోం ని ఈ మధ్యనే బ్లాగ్ స్పాట్ కి మార్చాల్సొచ్చింది. ఆ ప్రయత్నం లో భాగంగానే ఇన్నాళ్ళుగా ఇంగ్లీషు లోనో ట్రాన్స్లిటరేటెడ్ తెలుగు లోనో రాసిన నా రాతలన్నిటినీ ఒక్కొక్కటిగా తెలుగు లోకి మార్చి పోస్టు చేస్తున్నా! ఇదీ ఒకందుకు మంచిదెనేమో! ఎప్పటెప్పటివో కవితలన్నీ మళ్ళీ తిరగ రాస్తుంటే అదో రకమైన ఆనందం!!! ఇంకా చాలా పాటల లిరిక్సూ, ఇంకా ఎన్నో ఆర్టికల్సూ పోస్టు చెయ్యాల్సి ఉంది. ఈ కొత్త టెంప్లేటూ. ఒక్కొక్కటిగా కొత్త చోటుకి మారుతున్న నా రాతలూ గీతలూ... పదే పదే చూసుకుంటూ బొమ్మల కొలువు తీర్చిన పదేళ్ళ పాపలా మురిసిపోతున్నా!!!

0 comments:

Post a Comment